అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో జన సంచారం నిలిపేస్తున్నట్లు ప్రకటన

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో జన సంచారానికి అనుమతి లేదని అటవీ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుత సమయం వన్య ప్రాణుల పునరుత్పత్తి సమయం కావడంతోనే జన సంచారానికి అనుమతి లేదని, సఫారీ యాత్రకు కూడా అనుమతి రద్దు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ ఆదేశాలు సెప్టెంబర్‌ 30 వరకూ అమలులో వుంటాయని, పర్యాటకులు గమనించాలని అధికారులు తెలిపారు.

 

ప్రస్తుతం పెద్ద పులులు తమ పిల్లలకు జన్మనిచ్చాయని, ఈ సమయంలో చాలా కోపంతో వుంటాయని, అందుకే అనుమతులు వుండవన్నారు. వన్య ప్రాణుల పునరుత్పత్తికి అంతరాయం కలగూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రతి యేటా జరిగే లొద్ది మల్లయ్య జాతరను కూడా నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర శ్రీశైలం` హైదరాబాద్‌ ప్రధాన రహదారి నుంచి మన్ననూరు దాటిన తర్వాత వుంటుంది. కొండలు, గుట్టలతో కూడి వుంటుంది. అక్కడ కూడా వణ్య ప్రాణులు వుంటాయని, అందుకే ఈ యేడాది జాతర నిర్వాహణకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *