మద్యం, మాంసం అలవాటున్న పోలీసులకు కుంభమేళా డ్యూటీ లేదు : యూపీ సర్కార్
రాబోయే మహా కుంభమేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, మాంసాహారం తినే అలవాటున్న పోలీసులను ఆ సమయంలో విధుల్లోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ప్రయాగరాజ్ జిల్లా వాసులైనా సరే… ఆ పోలీసులను విధుల్లోకి తీసుకోరు. కుంభమేళా విధుల్లో పోలీసులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా మరియు సత్ప్రవర్తనతో వుండాలని ప్రభుత్వం సూచించింది. మద్యం, మాంసం అలవాటు లేని పోలీసుల జాబితాను రెండు దఫాలుగా పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 10న మొదటి దశ, నవంబర్ 10 న రెండో దఫా, డిసెంబర్ 10 న మూడో దఫాగా పేర్లను పంపాలని తెలిపింది. దీంతో పాటుగా క్లరికల్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగుల పేర్లను కూడా పంపాలని కోరింది.