భారత్‌ను చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాలి: నార్వే మంత్రి

భారత దేశం నుంచి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి వుందని నార్వే దేశ ఆరోగ్య మంత్రి జాన్ క్రిస్టియన్ వెస్ట్రే అన్నారు. భారతదేశంలో డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకే తమ దేశానికి సంబంధించిన ఆరోగ్య రంగ ప్రాధాన్యతల్లో సమన్వయం చేసుకోవడానికి తమ ప్రభుత్వం ఆసక్తిగా వుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో భారత దేశం సాధించిన విజయాలను ప్రశంసించారు.

జనాభా స్థాయి సేవా డెలివరీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమన్వయం అనేది భారత్ లో అద్భుతంగా వుందని ప్రశంసించారు. భారత్, నార్వే దేశాలు ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ డిజిటలైజేషన్ ను ఉపయోగించుకునే టెక్నాలజీని పంచుకుంటున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) తో పాటు ఆరోగ్య రంగ ఆవిష్కరణల కోసం మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలకు భారత్ కేంద్రంగా ఉందన్నారు.

డిజిటల్ పరివర్తనకు గ్లోబల్ బెంచ్ మార్క్ భారత్ అని వెస్ట్రే అభివర్ణించారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి సజావుగా సేవలను అందించే సమగ్ర డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించే సామర్థ్యం భారత్ కలిగి వుందన్నారు.భారతదేశం పూర్తిగా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఎలా నిర్మించిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా గమనిస్తున్నాయన్నారు. నార్వేతో సహా ప్రపంచ దేశాలు మొత్తం భారత్ ని చూసి నేర్చుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *