వేసవిలో ఆయిల్ పామ్ సాగు జాగ్రత్తలివీ.. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉద్యాన పంటలపై ఈ వాతావరణం తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమై, వేసవిలో ఉద్యానవన రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యింది. ముఖ్యంగా ఆయిల్‌ పాం పంటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎండల తీవ్రత, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆయిల్‌ పాం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వం ఆయిల్‌ పాం పంటలను బాగా ప్రోత్సహించింది. దీంతో చాలా మంది రైతులు ఆయిల్‌ పాం వైపు మొగ్గు చూపారు. కానీ ఎండల తీవ్రత కారణంగా, నీటి సౌలభ్యం బాగా లేకపోవడం వల్ల ఆయిల్‌ పాం బాగా తెబ్బతినే అవకాశాలున్నాయని అంటున్నారు.

వేసవిలో ఆయిల్‌ పామ్‌ సాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

1. మొక్కల పాదుల్లో మొదలుకు కొంచెం దూరంలో జనుము విత్తనాలు చల్లుకోవాలి.
2. ఇలా చేయడం వల్ల ఆయిల్‌ పాం మొక్కలను వేడి గాలుల నుంచి రక్షిస్తుంది.
3. నీటి ఎద్దడి వున్న పామాయిల్‌ తోటల్లో అంతర సేద్యం చేయకూడదు.
4. మూడేళ్ల లోపు వయస్సున్న ఆయిల్‌ పాం మొక్కల్లోని పూగుత్తులను లేత దశలోనే ప్రతి నెల ఆబ్లేషన్‌ సాధనం సాయంతో తొలగించాలి.
5. నీటి ఎద్దడి వున్న ప్రాంతాల్లో ఒకేసారి నీరు ఇవ్వకూడదు. విడతల వారీ ఇస్తూ పాదుల్లో తేమ వుండేట్లు చూసుకోవాలి.

వేసవిలో మొదటి సంవత్సరం మొక్కలకు మైక్రో జెట్‌లకు బదులుగా డ్రిప్పర్లు బిగించి నీరు పెట్టుకోవడం మంచిది. బాగా ఎదిగిన ఆయిల్‌పాం తోటల్లో గెలలు కోసిన తర్వాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పాం ఆకులు, మగ పూల గుత్తులు, మొక్కజొన్న చొప్ప, ఖాళీ ఆయిల్‌పాం గెలలు పాదుల్లో మల్చింగ్‌గా పరచాలి. ఆయిల్‌పాం మొక్కల ఆకులు నరకడం చేయకూడదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

‘మనం ఇంట్లో వాడే వంట నూనెల్లో ప్రధానమైంది పామాయిల్. ఈ నూనె ఆయిల్‌పాం అనే చెట్టు నుంచి వచ్చే గెలల నుంచి తీస్తారు. ఆయిల్‌పాం చెట్టు జీవిత కాలం 30 నుంచి 50 ఏళ్లు ఉండటం వల్ల రైతులకు మంచి ఆదాయం అందిస్తోంది. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్‌పాం అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు కేంద్ర ప్రాయోజిక కార్యక్రమం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్‌ఫాం, ఎన్‌ఎంఈఓ, ఓపీ ద్వారా అమలవుతోంది. తద్వారా 1992-93 నుంచి 2023-24 వరకు 2 లక్షల 3 వేల ఎకరాల విస్తీర్ణం ఆయిల్‌పాం పంట సాగు కిందకు తీసుకొచ్చినట్లైంది.’ అని ఉద్యానవన అధికారులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *