నీటి వసతులున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు
నీటి వసతులున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తే రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని ఏడీహెచ్ సంజయ్‌కుమార్, మహేశ్వరం ఏడీఏ సుజాత అన్నారు. శనివారం కందుకూరులోని రైతు వేదికలో ‘వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్‌సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ ఆధ్వర్యంలో ఉ ద్యానవన శాఖ అఽధికారులు నిర్వహించిన అవగాహనా సదస్సులో వారు మాట్లాడారు. ఆయిల్ పా మ్ తోటలకు చీడపీడలు సోకే ఆస్కారం తక్కువ అన్నారు. మొక్కలు నాటిన నాలుగేళ్ల అనంతరం ఏటా ఎకరానికి 8 నుంచి 12టన్నుల ఆయిల్ పా మ్ కాయల దిగుబడి వస్తాయన్నారు. ఆయిల్ పామ్ సాగుచేయాలనుకునే రైతులకు మొక్కలకు 90శాతం రాయితీ, డ్రిప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు.
మొక్కలు ఎదిగే వరకు నాలుగేళ్ల వరకు ఎకరానికి రైతుకు రూ.4,200 చొప్పున ప్రభుత్వం ఇస్తుంద న్నారు. ఒక్కసారి మొక్కలు నాటితే పంట మొద లైనప్పటి నుంచి 30ఏళ్ల పాటు రైతు దిగుబడి పొందుతాడన్నారు. కేవలం నీరు పెట్టి పైపాటు ఎరువులు వేస్తే సరిపోతుందన్నారు. పంట ర్కెటింగ్‌కు దిగులుచెందాల్సిన అవసరం లేకు ండా కంపెనీ వారే పంటను కొంటారన్నారు. ఎకరానికి 50 వరకు ఆయిల్ పామ్ మొక్కలు నా టుకోవాలన్నారు. ఈ పంటలో అంతరపంటలు సాగుచేసుకోవచ్చన్నారు. ఇది అదనపు ఆదాయం అన్నారు. ఉన్న రైతులు జూన్ 5వ తేదీకల్లా ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ఉద్యావన శాఖ అధికారులకు ద రఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అనంత రం రైతులకు రాయితీలు మంజూరవుతాయన్నా రు. కంపెనీ ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు మా ట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు తమ కంపెనీ ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లాలోని 16మండలాల్లో తమ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు.