35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో తెరుచుకున్న పురాతన ఆలయం

35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయ పునరుద్ధరణలో స్థానిక ముస్లింలు కీలక పాత్ర పోషించారు. వారు పండితులకు ఆలయాన్ని శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి, విగ్రహాలను ప్రతిష్టించడానికి పూర్తి సహాయాన్ని అందించారు.
1990లో కాశ్మీరీ పండితుల వలసల తర్వాత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం ఇప్పుడు స్థానిక సంఘాల మద్దతుతో పునరుద్ధరించబడింది. ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో ఆలయ ప్రాంగణం నుండి వెలికితీసిన పురాతన శివుని విగ్రహాన్నితిరిగి ప్రతిష్టించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు, భజన పాటలలో పాల్గొన్నారు.
బుద్గాంలో నివసిస్తున్న ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగులు సహా కాశ్మీరీ పండిట్ కుటుంబాలు, స్థానిక ముస్లింలు, జిల్లా యంత్రాంగం సహాయంతో ఆలయం, దాని పరిసర ప్రాంతాలను మళ్లీ ప్రతిష్టించే కార్యక్రమం చేపట్టారు.. కాశ్మీరీ పండిట్ సమాజం ఆలయంలో వారానికో, నెలకో సమావేశాలకు ప్రణాళికలు ప్రకటించింది, దీనిని సాధారణ ప్రార్థనా స్థలంగా, సమాజ కార్యక్రమాలకు మార్చాలనే లక్ష్యాన్ని కాశ్మీరి పండిట్ సమాజం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *