‘‘చార్ ధామ్’’ యాత్ర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక యాత్రికులు తమ తీర్థయాత్ర తేదీలను ప్లాన్ చేసుకుని ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ప్రతి ఏడాది మాదిరిగానే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వస్తుంటారు. అయితే, భక్తుల సౌకర్యార్ధం ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్ట్రేషన్​ను తప్పనిసరి చేసింది అధికార యంత్రాంగం. రిజిస్ట్రేషన్​ కోసం అధికారిక పోర్టల్​, మొబైల్​ యాప్​ను ఏర్పాటు చేసింది.

అదేవిధంగా యాత్రకు రెండు రోజుల ముందు (ఏప్రిల్ 17)న ఆఫ్​లైన్​ రిజిస్ట్రేషన్​ కూడా ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రిషికేశ్​, హరిద్వార్, దేహ్రాదూన్‌లో కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్​ 19న గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుచుకోవడంతో తీర్థయాత్ర ప్రారంభమవుతుంది. ఏప్రిల్​ 22న కేదార్​నాథ్​, ఏప్రిల్​ 23న బద్రీనాథ్​లో తలుపులు తెరుచుకుంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులు ప్రయాణ సమయంలో రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

చార్‌ధామ్ యాత్ర కోసం రిజిస్టర్​ చేసుకోవడానికి భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ పోర్టల్: registrationandtouristcare.uk.gov.in సందర్శించి నమోదు చేసుకోవచ్చు. అలాగే, మొబైల్ యాప్: Tourist Care Uttarakhand యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

 

చార్‌ధామ్ యాత్ర -ఏప్రిల్ 19న ప్రారంభం
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ- మార్చి 6
యమునోత్రి గంగోత్రి ద్వారాలు- ఏప్రిల్ 19
కేదార్‌నాథ్- ఏప్రిల్ 22
బద్రీనాథ్- ఏప్రిల్ 23
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 50 కౌంటర్లు ఏర్పాటు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *