బంగ్లాదేశ్ : డిసెంబర్ మాసంలోనే 8 మంది హిందువుల దారుణ హత్యలు

ఆగస్టు 2024లో షేక్ హసీనాను అప్రజాస్వామికంగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం దేశంలో గందరగోళం మరియు అశాంతిని సృష్టించడానికి హింసాత్మక ముస్లిం మూకలకు మరియు తీవ్రవాద శక్తులకు స్వేచ్ఛనిచ్చింది.
ఒక్క డిసెంబర్ మాసంలోనే 8 మంది హిందువులను అక్కడి ఛాందసులు ఊచకోత కోసేశారు. ఇప్పటికే హిందువులు, మైనారిటీలు అక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరింత దుర్బలంగా తయారైంది. ఇప్పుడు ఈ వివరాలను చూద్దాం.
1. ప్రాంతోస్ కర్మాకర్.. (42)
డిసెంబర్ 2 న కర్మాకర్ హత్య జరిగింది. ఇతడు ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. బంగ్లాదేశ్ లోని నర్సింగ్డి జిల్లాలో ఇతడ్ని ఛాందసులు కాల్చి చంపారు. దుండగులు ముసుగులు ధరించి, అతడ్ని నివాసం నుంచి బయటికి పిలిచారు. తర్వాత ప్రభుత్వ పాఠశాల మైదానానికి తీసుకెళ్లి, పాయింట్ బ్లాక్ లో గన్ ను పెట్టి, ఛాతీపై కాల్చి చంపేశారు. వెంటనే దుండగులు పారిపోయారు.
2. ఉత్పల్ సర్కార్… (35)
డిసెంబర్ 5 న ఛాందసులు ఇతడిపై దాడి చేసి చంపేశారు. బంగ్లాదేశ్ లో ఉత్పల్ చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఫరీద్‌పూర్ జిల్లాలోని సల్తా అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఉత్పల్ సర్కార్ వ్యానులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు వ్యాన్ ను ఆపేసి, ఉత్పల్ ఛాతీపై కత్తితో దాడి చేసి చంపేశారు.పారిపోయే ముందు ఉత్పల్ సర్కార్ వద్ద ఉన్న డబ్బును కూడా దోచుకున్నారు. అయితే.. ఆ వ్యాను డ్రైవర్ ఫిరోజ్ మొల్లాను మాత్రం దుండగులు ఏమీ అనలేదు.
3. జోగేష్ చంద్ర రాయ్, సుబోర్ణా రాయ్ :(75)
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జోగేష్ చంద్ర రాయ్ (75)ని డిసెంబర్ 7వ తేదీ రాత్రి తన నివాసంలో దుండగులు నరికి చంపారు.అతని భార్య సుబోర్నో రాయ్ (60) కూడా ఈ దాడిలోనే మరణించింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో జరిగింది.జోగేష్ చంద్ర రాయ్ మృతదేహం డైనింగ్ రూమ్‌లో లభించగా, సుబోర్నో రాయ్ మృతదేహం వంటగదిలో దొరికింది.
4. శాంతో దాస్ :
శాంతో దాస్ హత్య డిసెంబర్ 12 న జరిగింది. కోమిల్లా జిల్లాలోని హోమ్నా ప్రాంతంలోని ఓ పంట పొలంలో ఇతడి మృతదేహం దొరికింది. శాంతోదాస్ ఆటో డ్రైవర్. అలాగే గ్రామ పోలీసు దళంలో సభ్యుడు కూడా.
5. దీపు చంద్ర దాస్ :(27)
డిసెంబర్ 18 న దీపుచంద్ర దాస్ పై ముస్లిం ఛాందసులు మూకదాడి చేసి, కొట్టి చంపేశారు. ఈ హత్య ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితుడిని కొట్టి, చెట్టుకు కట్టేసి, నిప్పంటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ ఓ బట్టల దుకాణంలో పనిచేసే దీపుచంద్ర దాస్.. మహ్మద్ ప్రవక్తను అవమానించాడని అభాండాలు మోపి మరీ చంపేసింది ఛాందసుల మూక.
6. అమృత్ మండల్ (29)
డిసెంబర్ 24 న ఇతడి హత్య జరిగింది. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలోని పంగ్షా అనే ప్రాంతంలో ఉన్మాద గుంపు కొట్టి చంపేసింది. అమృత్ మండల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు, కానీ అతను చికిత్స పొందుతూ మరణించాడు.
7. పింటూ అఖండ (35)
బంగ్లాదేశ్‌లోని బోగురా జిల్లాలోని ఆడమ్‌డిఘి అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించి, అపహరించారు. ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. పింటూ అఖండ వ్యాపారవేత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *