ఆపరేషన్ సిందూర్ అయిపోలేదు : ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ ముగిసిందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో భారత ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. అసలు ఆపరేషన్ సిందూర్ ముగియలేదంటూ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని, విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సిందూర్ ను కొనసాగించామని పేర్కొంది. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని, ఆపరేషన్ సిందూర్ పై ఊహాగానాలు, ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరింది.ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్. అనధికారిక సమాచారం, పుకార్ల వ్యాప్తికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.