ఆఫ్ఘనిస్థాన్‌లో ‘ఆపరేషన్‌ ‌దేవీశక్తి’

ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశం తాలిబన్‌ ‌తీవ్రవాదుల వశమైంది. దీంతో ఆ దేశంలోని ఆఫ్ఘన్‌ ‌పౌరులతో పాటు.. ఇతర దేశాలకు చెందిన పౌరులు ఆ దేశాన్ని వీడి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌ ‌రాజధాని కాబూల్‌ ‌లోని విమానాశ్రయం నుంచి ప్రజలను తరలిం    చేందుకు భారత్‌ ‌చర్యలు చేపట్టింది. ‘‘ఆపరేషన్‌ ‌దేవీశక్తి’’ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. కేవలం భారతీయుల కోసమే కాకుండా కోరిన వారిని కూడా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయు లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం  ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఈ ఆపరే షన్‌లో భాగంగా ఇప్పటివరకు 228 భారతీయులతోసహా మొత్తం 626మందిని తరలించి నట్టు కేంద్రమంత్రి హరదీప్‌ ‌సింగ్‌ ‌వెల్లడించారు.

 కాబూల్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి ఎయిర్‌ ఇం‌డియా విమానంలో వందల మంది భారతీయులు సురక్షితంగా మాతృభూమికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక విమానంలో ప్రయాణించిన భారతీయులందరూ ‘‘భారత్‌ ‌మాతా కీ జై’’ అంటూ విమానంలో గట్టిగా నినాదాలు చేసిన వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయింది. స్వదేశానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనందోత్సహాలతో ఉన్న భారతీయులు అంటూ పలువురు ఆ వీడియోను షేర్‌ ‌చేశారు.

 సిక్కులు తమ పవిత్ర గ్రంథాలైన గురుగ్రంథ్‌ 3 ‌కాపీలను భారత్‌కు తీసుకురాగా వాటిని హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరి, మురళీధర్‌లు  తలపై పెట్టుకుని ఢిల్లీ వినాయశ్రయంలోకి తీసుకొచ్చారు.

కరోనా నేపథ్యంలో అఫ్ఘాన్‌ ‌నుంచి వస్తున్న వారికి భారత ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తోంది.

4,600 వీసాలు జారీ

కాబూల్‌తో సహా పట్టణ కేంద్రాలను తాలిబాన్‌ ‌స్వాధీనం చేసుకున్న తరువాత అభ్యర్థనల పెరుగుదలను అధికారులు అంచనా వేయడంతో గత 20 రోజుల్లో భారతదేశం దాదాపు 4,600 వీసాలను ఆఫ్ఘన్‌ ‌జాతీయులకు జారీ చేసింది. గత నెలలో 3,500 మంది భారతీయులు అక్కడకు వెళ్లారని భారత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *