మజ్జిగ, గంజి, ఆవు పేడతో లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
వేలకు వేలు ఖర్చు పెట్టలేదు.. కేవలం తన దగ్గర వున్న కొన్నింటితో లక్షలు సంపాదిస్తున్నాడు ఆ యువరైతు. మజ్జిగ, గంజి, ఆవు పేడ, ఆవు పాలు, నేల నుంచి తీసిన మట్టితో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు. ఆ యువ రైతు పేరు శబరినాథ్. స్వస్థలం కృష్ణాజిల్లా కొండూరు గ్రామం. తన కుటుంబ సభ్యులకు తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. దీనికి కారణం తినే తిండి అని తెలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఆయన సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నాడు. కేవలం మజ్జిగ, గంజి, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, నేల నుంచి తీసిన మట్టినే తన పొలానికి వినియోగిస్తూ… మంచి ఫలితాలను పొందుతున్నాడు. గుంటూరులో ‘రైతు నేస్తం’ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. దీని తర్వాత జామకాయ, బొప్పాయిని అంతర్ పంటగా కూడా వేస్తున్నాడు. కలుపు నివారణకు మాన్ సింగ్ ఫిట్స్ ఉపయోగించాడు. అందుల అంతర్ పంటగా మిర్చి, బెండ, వంగ, బంతి, దానిమ్మ సాగు చేస్తున్నాడు. తొలి యేడాది నుంచే మంచి కాపు వచ్చింది. ఆ తర్వాత మంచి ఆదాయం కూడా వచ్చిందని శబరినాథ్ తెలిపాడు.
గరళకంట కషాయం తయారు చేసి, కలుపు నివారణ చర్యలు తీసుకున్నాడు. ముందుగా కలుపు మొక్కలను వేరుతో తొలగించి, బూడిద చేస్తారు.100 గ్రాముల ఆవు మూత్రం, 100 గ్రాముల పంచదార కలిపి 3 రోజుల పాటు ఒక డ్రమ్ములో వుంచాడు. మూడు రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపాడు. ఈ ద్రావణాన్ని మళ్లీ మూడు రోజుల పాటు నిల్వ చేయాలి. అలా తయారైన గరళకంళ కషాయాన్ని కలుపు నివారణకు పిచికారీ చేశాడు. ఇలా మేలైన సాగు పద్ధతిలో పండిరచిన వాటిని విక్రయిస్తున్నాడు.