సేంద్రియసాగే బాగు బాగు..

మెదక్‌ జిల్లాలోని కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రం దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న దాదాపు 655 కుటుంబాలు ఒక్కచోటకి వచ్చాయి. తాము చేస్తున్న సేంద్రీయ వ్యవసాయ విధానాలను, సాధించిన అభివృద్ధి, మార్కెటింగ్‌ చేసే విధానాన్ని పరిచయం చేశాయి. మెదక్‌ జిల్లాలోని 30 గ్రామాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న దాదాపు 600 మంది రైతులు ఈ సమ్మేళనానికి వచ్చారు. అలాగే మరో 500 మంది సాధారణ వ్యవసాయం చేసే రైతులు కూడా వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో తాము కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతామన్న దృఢ సంకల్పం తీసుకున్న రైతులు వీరంతా. వీరిని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ఈ సమ్మేళన నిర్వాహకులు ‘‘అభ్యుదయ రైతులు’’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు, వారి వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్‌ విధానం, సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిరచిన పంటల తీరు తెన్నులను పరిశీలించడానికి వచ్చారు.

తునికి కేంద్ర ప్రత్యేకత

 ఈ కేంద్రం సేంద్రీయ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. సేంద్రీయ వ్యవసాయ రైతులకు నిత్యం అందుబాటులో వుంటూ… వారిని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు ఇబ్బందులను పరిష్కరిస్తుంది. కేవలం సేంద్రీయ వ్యవసాయం మీదే ఈ కేంద్రం దృష్టి నిలుపుతుంది. ఈ కృషి విజ్ఞాన కేంద్రంలోని 10 నుంచి 15 మంది శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయం ఆధారంగా రకరకాల పంటలను రైతులతో వేయిస్తూ… మార్గదర్శనం చేస్తుంటారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రం పేరు ఏకలవ్య గ్రామ వికాస కృషి విజ్ఞాన కేంద్రం. సేంద్రీయ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని, గోఆధారిత వ్యవసాయాన్ని ఈ కేంద్రం ప్రమోట్‌ చేస్తుంది.2017లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (IజAR), న్యూఢల్లీి అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు మెదక్‌ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ చాలా లాభాలు ఆర్జిస్తున్నారు. రైతుల సామార్థ్యాన్ని పెంచడం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థిరమైన, స్వావలంబ ఆర్థిక వ్యవస్థకు కృషి చేస్తోంది. అలాగే రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువతకు శిక్షణనిస్తూ, వారి సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *