తిరుపతిలో రెండు రోజుల పాటు ఆర్గానిక్ మేళా
ఈ నెల 3,4 తేదీల్లో తిరుపతిలో సేంద్రీయ పద్ధతుల్లో పండిరచిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళా జరగనుంది. తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళా క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిరచిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన పరిరక్షణపై బాపన్న అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ వుంటుంది.