తిరుపతిలో ఆర్గానిక్ మేళ విజయవంతం…. మూడు రాష్ట్రాల నుండి రైతుల హాజరు
తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఆర్గానిక్ మేళా విజయవంతమైంది. కనెక్ట్`2 ఫార్మర్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో దాదాపు 50 ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్స్ వుంచారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తున్న రైతులు వచ్చారు. ఆర్గనిక్ ఉత్పత్తులను ఈ మేళా స్టాల్స్‌లో వుంచారు. దేశంలో రోజురోజుకీ రసాయనిక పదార్థాలతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల మనిషి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ… ఆర్గానిక్ పద్ధతిలో పండిరచిన పదార్థాలను తీసుకోవడం వల్ల మనిషి జీవన ప్రమాణం కూడా పెరుగుతుందని, ఆరోగ్యవంతంగా కూడా వుంటారని తెలిపారు. తమ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ బాధ్యులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కూడా ఈ ఆర్గానిక్ మేళాను తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామని బొప్ప శిల్ప ప్రకటించారు. మరోవైపు.. మేళాకు వచ్చిన వారికి తమ ఉత్పత్తుల గురించి, వాడే విధానాల గురించి రైతులు తెలియజేశారు.
సదస్సులో భాగంగా మొదటి రోజు కషాయాల గురించి గంగిరెడ్డి గారు ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసుకునే కషాయాల గురించి, ఐదు రకాల దేశవాళీ బియ్యంవాడే విధానంపై శిక్షణ ఇచ్చారు. తర్వాత జె.ఎస్. రెడ్డి మిద్దె తోటల పెంపకం, వాటి వల్ల లాభాలు, దేశవాళీ పండ్ల పెంపకం, మొక్కల గ్రాఫ్టింగ్ పై శిక్షణనిచ్చారు. ఇక… రెండో రోజు విజయరామ్ పండ్ల పెంపకం, ఇంటి దగ్గర, పొలంలో ఇంకుగు గుంతల తయారీ, దేశవాళీ బియ్యంతో భోజనం అనే అంశంపై ప్రసంగించారు.