రెండు రోజుల పాటూ తిరుపతిలో సేంద్రీయ ఆహారోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా
తిరుపతిలోని టౌన్ క్లబ్ మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20,21 తేదీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు కనెక్ట్ 2 ఫార్మర్ ఆధ్వర్యంలో సేంద్రీయ ఆహారోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకో గలిగే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కనెక్ట్2 ఫార్మర్ శిల్ప తెలిపారు. 20 వ తేదీన కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు, పూల మొక్కల గ్రాస్టింగ్‌పై జె.ఎస్,రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే కంపోస్టింగ్‌పై డా. సింధు అవగాహన కల్పిస్తారు. 21 న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడు గుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతి వనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు 6303606326 నెంబరును సంప్రదించగలరు.