సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అవునా? కాదా? పరీక్షించే విధానమిదీ…

ఈ రోజుల్లో రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అదే స్థాయిలో వుంది. వీటన్నింటితో పాటు వినియోగదారులు కూడా అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తుల పేరు నకిలీ చేసే వారి విషయంపై కేంద్రం దృష్టి సారించింది. అందుకే సంబంధిత ఉత్పత్తులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన సర్టిఫికేట్ వుందా? లేదా? అన్నది చూసుకోవాల్సి వుంటుంది. అయితే.. గుంటూరులోని లాంఫామ్ లో ఆర్గానిక్ ఉత్పత్తులను ధ్రువీకరించే సంస్థ వుంది. ఇది ఆమోదిస్తేనే రైతులు తమ పంటను మంచి ధరకు విక్రయించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విభజనకి పూర్వం సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. విభజన తర్వాత గుంటూరులోని లాంఫామ్ లో ఏర్పాటైంది. దీనికి దేశ రాజధానిలోని క్వాలిటీ కౌన్సిల్ ఇఫ్ ఇండియా, ఎంపెడాతో పాటు ఘజియాబాద్ లోని జాతీయ ఆర్గానిక్, ప్రకృతి సాగు సంస్థలు అనుమతులున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లోని పంట ఉత్పత్తులను పరీక్షించే అధికారం వుంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 30 కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాయి.

 

ఇక్కడ ఏ పంటనైనా పరిశీలించి, సేంద్రీయ పద్ధతా? కాదా? అన్నది నిర్ధారిస్తారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, భూమి, విత్తనాల ఎంపిక, సాగు విధానాలు.. ఇలా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఏమేమి చేస్తామో.. వాటన్నింటినీ పరీక్షిస్తారు. ప్రయోగశాలల్లో కూడా ఉత్పత్తులను పరీక్షిస్తారు. అంతా సవ్యంగా వుంటేనే… ముద్ర వేస్తారు. అయితే.. దీనిని ఎలా నమ్మాలి అంటే.. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి… దీనిని నమ్మవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *