దేశంలోనే మొట్టమొదటి ‘‘ఆక్సిజన్ బర్డ్ పార్క్’’.. ప్రత్యేకత ఏమిటంటే

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాగపూర్ వేదికగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో మొదటి సారిగా ‘‘ఆక్సిజన్ బర్డ్ పార్క్’’ ప్రారంభించింది. ఇది మన భారత్ లో కనిపించే అనేక రకాల పక్షి జాతులు మరియు మొక్కలను దృష్టిలో వుంచుకొని రూపొందించారు. అనేక రకాల పక్షులను చూడడానికి, హరిత ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం, అన్ని పక్షి జాతులకు సురక్షితమైన ఆవాసంగా దీనిని రూపొందించారు. ఈ ఆలోచన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీది అని అధికారులు ప్రకటించారు. ఈ పార్క్ నాగపూర్ – హైదరాబాద్ 44 జాతీయ రహదారిపై వుంటుంది. 8.23 హెక్టార్ల విస్తీర్ణంలో వుంది. దీనిని అమృత్ మహోత్సవ్ పార్క్ అని కూడా పిలుచుకుంటారు. దాదాపు 14 కోట్లతో దీనిని నెలకొల్పారు.

సుస్థిరతపై దృష్టి పెట్టడమే ఈ పార్క్ ఉద్దేశం. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. అలాగే ముఖ్య విషయం ఏమిటంటే వేగంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చెట్లను ఎంపిక చేసి, ఈ పార్కులో నాటారు. దీనిలో నాగపూర్ సోషల్ ఫారెస్ట్ విభాగానిదే కీలక పాత్ర. వివిధ రకాల పక్షులను వుంచడం, పర్యావరణ మెరుగుదలే లక్ష్యంగా ఇది వుంది. ఇందులో అత్యంత అరుదైన ఇండియన్ బేల్, గమ్ కారయా, అంతరించిపోతున్న చెట్లను ఇందులో వుంచారు.

‘‘ఈ ఉద్యానవనం ఆక్సిజన్-ఉత్పత్తి చేసే జోన్‌గా మాత్రమే కాకుండా విభిన్న పక్షి జాతులకు అభివృద్ధి చెందుతున్న ఆవాసంగా కూడా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.పక్షులకు మొక్కల నుండి తగినంత ఆహారం ఉండేలా చూసేందుకు, పక్షుల కోసం ప్రత్యేకంగా పండ్ల చెట్లను నాటాం’’ అని అధికారులు వివరించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చాలా మట్టుకు పక్షులు, వృక్షాలు అంతరించిపోతున్నాయి. వాటికి సురక్షితమైన ఆవాసం కూడా లేదు. దీంతో అలాంటి అరుదైన పక్షి జాతులను ఈ పార్క్ లోకి తెచ్చారు. అలాగే సురక్షితమైన ఆవాసం అందించడానికి గ్రీన్ స్పేస్ ను కూడా ఏర్పాటుచేశారు. సహజంగా వుండేలా ఈ పార్క్ ను రూపొందించారు.

ఈ పార్క్ ను రూపొందించడానికి నేషనల్ హైవే అథారిటీ ఓ బయో డైవర్సిటీ కన్సల్టెంట్ తో ఒప్పందం చేసుకున్నారు. వారు ఓసారి స్థలాన్ని పరిశీలించి, పూర్తిగా అధ్యయనం చేశారు. అక్కడి భూమి జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడానికి కూడా కొన్ని సూచనలు చేశారు. అలాగే వేప, వెదురు, మర్రి, మరియు దేశీయ చెట్లను ఇందులో కచ్చితంగా వుంచాలని హైవే అథారిటీకి ఈ బయోడైవర్సిటీ కన్సల్టెంట్ వారు సూచించారు.అలాగే పక్షులు తినడానికి జామచెట్లు, మామిడి, బెల్లము, చింతపండు, సీతాఫలం, ఉసిరి, పనస లాంటి చెట్లను కూడా నాటారు. అలాగే కొన్ని ఔషధ మొక్కలను కూడా నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *