రైతన్నలకు ‘పద్మాలు’

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో రైతులు కూడా వున్నారు. అసాధారణ కృషితో విశేష ప్రయోగాలు చేస్తూ… రైతులు ‘‘పద్మశ్రీ’’ అయ్యారు. ఇందులో సుభాష్‌ శర్మ, హారిమన్‌ శర్మ, హాంగ్‌ థింగ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన హరిమన్‌ శర్మ దార్శనిక రైతు. ఆపిల్‌ పండ్ల తోటలను మంచు కొండల మీద నుంచి మైదానంలోకి తీసుకొచ్చి, పండిరచి, సక్సెస్‌ అయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని గల్లసిన్‌ గ్రామంలో 1956లో పుట్టారు. చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ వచ్చారు. అయినా.. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 1992 ప్రాంతంలో పడిన విపరీతమైన మంచు వల్ల మామిడి చెట్లు సర్వనాశనం అయ్యాయి. దీంతో ఆపిల్‌ సాగు చేయాలని భావించారు హరిమన్‌ శర్మ. అయితే చల్లగా వుండే కొండ ప్రాంతాల్లోనే యాపిల్‌ పంట వస్తుందని ఆయనకు ప్రాథమిక అవగాహన వుంది.

అయినా తమ ప్రాంతంలో వాటికి ఎందుకు పండిరచకూడదన్న ఆలోచన వచ్చింది. దీంతో హారిమన్‌ శర్మ ప్రయోగాలు చేయడం ప్రారంభిం చారు. పట్టు విడవకుండా పనిచేస్తూ.. సముద్ర తలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ప్రాంతాల్లో, అదీ వేసవిలో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతావరణంల కూడా, ఆపిల్‌ పండ్లను సాగు చేశారు. ఈ కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

సేంద్రీయ వ్యవసాయంతో పత్తిలో వినూత్న పద్ధతి

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం అత్యంత కరువు ప్రాంతం. అక్కడ కూడా భూసారాన్ని పరిరక్షిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు సుభాష్‌ శర్మ. నల్లరేగడి పొలాల్లో అనేక వినూత్న సుస్థిర వ్యవసాయ పద్ధతులను కనుగొని, అనుసరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోవ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. మెట్ట ప్రాంతాల్లో ప్రకృతి సేద్యానికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించారు. 30 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యమే చేస్తున్నాడు. 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దుల మేతకు ఇచ్చేసి, మిగతా పది ఎకరాల్లో సేంద్రీయ పద్ధతి ద్వారా వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. మార్కెట్‌లో గిరాకీ వుండే పంటలేవో తెలుసుకొని, సాగు చేస్తున్నారు. అయితే పత్తి సాగులో వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదనే కీలకం. దీని కోసం రెండు సాళ్లు పత్తి వేస్తాడు. ఆ పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదన వేస్తారు. పత్తి, కందిని కూడా ఆచ్ఛాదనగా వేస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత.

ఉద్యాన పంటలు, కొత్త పంటల మేటి హాంగ్‌ థింగ్‌..

హాంగ్‌ థింగ్‌ ది నాగాలాండ్‌ ప్రాంతం. కొత్త పంటలను పండిరచడంలో దిట్ట. అలాగే కొత్త ఉద్యాన పంటలను కూడా అందుబాటులోకి తేవడంలో కృషి చేస్తున్నారు. నాగాలాండ్‌ ప్రాంతం లోని రైతులకు చిలి, నారింజ వంటి కొత్త పండ్ల రకాలను అందుబాటులోకి తెచ్చారు. 30 సంవత్స రాలుగా ఉద్యాన తోటలను సాగు చేస్తున్నారు. దీంతో 40 గ్రామాల్లో 200 మంది రైతులు కొత్త రకాల పండ్ల చెట్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకున్నారు. మరోవైపు తిని పారేసిన పండ్ల విత్తనాలను సేకరించి, వాటిని మొలకెత్తించే ప్రక్రియ కూడా విశేషంగా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *