పద్మ పురస్కారాలు -2027 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘‘పద్మ పురస్కరాలు-2027’’ కోసం నామినేషన్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, గౌరవించే ఈ అవార్డులను 2027 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించనున్నారు. ఈ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను కైవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’’ ఉపయోగపడుతుంది. నామినేషన్లు సమర్పించడానికి జూలై 31,2026 వరకు గడువు వుంది.

ముందుగా awards.go.in పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. అందులో రిజిస్టర్ అయ్యి, లాగిన్ ఐడీని తయారు చేసుకోవాలి. తర్వాత padma awards సెక్షన్ లోకి వెళ్లి, వ్యక్తి లేదా సంస్థ వివరాలను నింపాలి. నామినేట్ చేసిన వ్యక్తి సాధించిన విజయాలు, సేవలను అందులో వివరిస్తూ, 800 పదాలకు మించకుండా రాయాలి. తర్వాత అవసరమైన పత్రాలన్నీ జత చేసిన ఫారమ్ ను ఆన్ లైన్ లో సమర్పించాలి. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర హోంశాఖ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *