శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం..

దేవాదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

హిందూయేరత మతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు, మొదలగు వాటిని శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రదర్శించటం పూర్తిగా నిషేధించమన్నారు. దేవస్థానానికి సంబంధించిన వాహనాలపై అన్యమత సూక్తులు, బొమ్మలు, బోధనలు, అన్యమతానికి సంబంధించిన ఫోటో గ్రాఫ్‌లను అనుమతించబోమని స్పష్టం చేశారు.

అన్యమత ప్రచారానికి సహకరించిన దేవాదాయ ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. ఉద్యోగులు కూడా నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. జగద్గురువు శంకరాచార్య స్వామి, శ్రీశైల క్షేత్రాన్ని భారతీయ సంస్కృతికి, ధార్మిక పరంపరలకు ముఖ్య కేంద్రంగా పేర్కొన్న ప్రతీ ఒక్కరూ గుర్తుంచకోవాలన్నారు. ఆదిదంపతుల దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు దేవాదాయ శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు.  మరోవైపు ప్లాస్టిక్‌ని కూడా దేవస్థానం పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. శ్రీశైల మహా క్షేత్రంలో ప్లాస్టిక్‌, నాన్‌ ఓవెన్‌ కవర్ల వాడకం పూర్తిగా నిషేధించడానికి పలు చర్యలతో కూడిన ఆంక్షలు విధిస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.క్షేత్ర పరిధిలో దేవస్థాన నిబంధనలు, ఆంక్షలను పాటింప జేసేలా సమర్థవంతమైన అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ ప్రతినిత్యం తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్రానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *