ఆపరేషన్ మహాదేవ : డ్రోన్లు, పక్కా నిఘాతో విజయం సాధించిన భద్రతా బలగాలు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ పేరుతో పహల్గాం ఉగ్రదాడికి కారకులైన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హషీం మూసా అలియాస్ సులేమాన్ అనే ఇస్లామిక్ ఉగ్రవాది కూడా ఈ ఎన్ కౌంటర్ లో హతమైనట్లు చెబుతున్నారు. అయితే మరో ఇద్దరు అబూ హమ్జా, యాసిర్ అనే ఉగ్రవాదులని భద్రతా దళాలు ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చాయి. జమ్మూ కశ్మీర్ లోని దచిగామ్ కి సమీపంలోని హర్వాన్ అటవీ ప్రాంతంలో సోమవారం భారత భద్రతా దళాలకు, ఇస్లామిక్ ఉగ్రవాదులకు భీకర కాల్పులు జరిగాయి. భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు వారిని కాల్చిపారేశాయి.
మరోవైపు దీనికి సంబంధించిన భారత ఆర్మీ అధికారులు కూడా ఎక్స్ మాధ్యమంగా స్పందించారు. ‘‘తీవ్రమైన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది’’ అని చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ పేర్కొంది.అలాగే శ్రీనగర్ SSP జీవీ సందీప్ చక్రవర్తి కూడా ఈ ఆపరేషన్ పై స్పందతించారు. హతమైన ఉగ్రవాదులు ముగ్గురూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని, లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకి చెందినవారేనని ప్రకటించారు.హర్వాన్ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. కొన్ని రోజులుగా పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేశారు. దాచిగామ్ అడవుల్లో రెండు రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను భద్రతా దళాయి గుర్తించాయి. అలాగే స్థానికంగా వుండే వారు కూడా భద్రతా బలగాలకు ఈ కీలక విషయాన్ని వెల్లడించాయి.
వీటన్నింటినీ నిర్ధారణ చేసుకున్న భారత సైన్యం సోమవారం అత్యంత ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగింది. 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు అక్కడే వున్నట్లు నిర్ధారించుకుంది. మొదట్లో కాస్త ఎదురు కాల్పులు జరిగినా.. ఉగ్రవాదులు కోలుకునే లోపే.. భారత సైన్యం విరుచుకుపడింది.
MAHADEV2
96 రోజుల తర్వాత అతిపెద్ద విజయం సాధించిన భద్రతా దళాలు..
ఏప్రిల్ 22 న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో భయంకరమైన ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి జరిగిన 96 రోజుల తర్వాత భారత సైన్యం ప్రణాళిక ప్రకారం ప్రతీకారం తీర్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడితో అమాయకులైన 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ స్టార్ట్ చేసి, గేమ్ ఓవర్ అని భద్రతా దళాలు ప్రకటించాయి.
ఆపరేషన్ మహాదేవ్…
ఈ ఆపరేషన్ కోసం 96 రోజుల పాటు భారత భద్రతా బలగాలు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను హతమార్చడానికే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ నెల 28 (సోమవారం) ఉదయం నుంచి ఈ ప్రణాళికను అమలు చేశాయి భద్రతా బలగాలు. దాచిగామ్ అనే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ తో శ్రీకారం చుట్టారు. ఇందులో భారత సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) తో పాటు వివిధ రకాల భద్రతా బలగాలు పాలుపంచుకున్నాయి.
MAHADEV23
ఉగ్రవాదులను సైన్యం ఎలా గుర్తించిందంటే…
1. పటిష్టమైన నిఘా తో పాటు డ్రోన్ల ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాదులు అడవిలో ఎక్కడ నక్కారో సైన్యం ట్రాక్ చేసింది. దచిగామ్ అడవుల్లోనే నక్కారని పక్కాగా గుర్తుపట్టారు.
2. సోమవారం ఉదయం భద్రతా బలగాలు దాచిగామ్ అనే ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మొదట ఉగ్రవాదులే కాల్పులు ప్రారంభించారు. ఆతర్వాత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. 6 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు.
3. ఈ ఘటనా స్థలం నుంచి AK-47, గ్రెనేడ్‌లు మరియు IED (ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను పహల్గామ్ దాడిలో ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *