పీవోకే వాసులు భారత్ లో కలిసేందుకు ముందుకు రావాలి : రాజ్ నాథ్
పీఓకే వాసులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ కీలక పిలుపునిచ్చారు. పీవోకే వాసులు భారత్ లో కలిసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ మాదిరి తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని అన్నారు. జమ్మూలో బీజేపీకి మద్దతిస్తే… మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తమకు పాక్ తో కలిసి వుండటం ఇష్టం లేదని, భారత్ కి వెళ్తామని పీవోకేలోని ప్రజలూ చెప్పేంత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పీవోకేను పాక్ ఓ విదేశీ భూభాగంగా పరిగణిస్తోందని, అక్కడి సొలిసిటరీ జనరల్ కూడా ఇదే విషయాన్ని ఓ అఫిడవిట్ లో చెప్పారని గుర్తు చేశారు. అక్కడి ప్రజలను పాక్ విదేశీయులుగా చూస్తోందని, కానీ… భారత్ అలా కాదని, సొంత మనుషుల్లుగా భావిస్తోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.