శక్తిపీఠంపై దాడి వెనుక చైనా హస్తం?
పాకిస్తాన్‌లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరంపై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51 శక్తి పీఠాలలో 6 బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు వెళ్లాయి. భారతదేశంలో ఉన్న హిందువులను కలవరపాటుకు గురి చేయడానికి మతోన్మాద ముస్లింలు ఈ ఆరు శక్తిపీఠాలపై దాడి చేస్తూ ఉంటారు. హింగ్లాజ్ దేవి మందిర విధ్వంసం కూడా ఈ దృష్టిలోనే చూడవలసి ఉంటుంది. ఇది కాకుండా నాలుగు శక్తిపీఠాలు చైనా, నేపాల్, శ్రీలంక అధీనంలో ఉన్నాయి. నేపాల్‌లో రెండు, చైనా ఆక్రమిత టిబెట్‌లో ఒక శక్తి పీఠం, ఇంకొకటి శ్రీలంకలో ఉన్నాయి. ప్రస్తుతం యావత్ భారతదేశంలో 41 ముఖ్య శక్తి పీఠాలు మిగిలాయి.
నేపాల్ హిందు ఆధిక్యత కలిగిన దేశం, జాఫ్నాలో హిందువుల సంఖ్య ఎక్కువ, కాబట్టి శక్తిపీఠాల విషయంలో ఎలాంటి సమస్యలు లేవు, కానీ 1949లో చైనా టిబెట్‌ను స్వాధీనం చేసుకున్న ప్పటి నుండి భారతీయ హిందువులు మానసదేవి శక్తిపీఠానికి వెళ్లడం మానేశారు. భారతదేశం ఇచ్చిన వాణిజ్యపరమైన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఎక్కడ కోల్పోతుందో అనే భయంతో బంగ్లాదేశ్ గత ఏడు-ఎనిమిదేళ్లుగా జశోరేషేశ్వరి ఆలయంతో సహా మిగిలిన ఐదు శక్తిపీఠాలలో విధ్వంసకర సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది. ఇది బంగ్లాదేశ్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జశోరేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లోని శక్తిపీఠాలను పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు సందర్శించడం ప్రారంభిం చారు. దీని వల్ల బంగ్లాదేశ్‌కు పర్యాటకం రూపంలో మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
హింగ్లాజ్ మాత ఆలయాన్ని పదే పదే దెబ్బతీసే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? రాజకీయ, దౌత్యపరంగా చూస్తే ఇవి కేవలం మతపరమైన దాడులు కావు అని తెలుస్తున్నది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌లో చైనా ఆధిపత్యం పెరిగిపోయిందని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో తాలిబన్ల జోక్యం కూడా ప్రబలింది. పాకిస్థాన్‌లో జరిపిన తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో దేవాలయాల అవశేషాలు బయటపడుతున్నాయి. ఇండోనేషియాతో సహా అనేక దేశాల్లో పురాతన మందిరాలు ఉండటంవల్ల ఆ దేశాలు హిందూ త్వంతో తమనుతాము గుర్తించుకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో హిందూ దేవాలయాల కారణంగా అక్కడ హిందూ మతం విస్తరించవచ్చు నని పాకిస్తాన్ ఛాందసవాదులు భయపడు తున్నారు. కానీ ఇది చాలా సాధారణ కారణం. నిజానికి యురేనియం, స్ఫటికం, రూబీ, నీలమణి లాంటి విలువైన వస్తువులున్న మానస సరోవర్ ప్రాంతాన్ని చైనా స్వేచ్ఛగా పాలించాలను కుంటోంది. అందుకే భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థానీలకు పని కల్పిస్తోంది. కైలాష్ మానస సరోవర్ నుండి ఈ విలువైన పదార్దాలను వెలికి తీయడం కోసం భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తోంది. హింగ్లాజ్ దేవి మందిరంపై నిరంతరం జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది జిత్తులమారి చైనా.