అమృత్ సర్ సెక్టార్ లో పాక్ జాతీయుడ్ని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
అమృత్ సర్ సెక్టార్ లోని ములకోటలోని బోర్డ్ అవుట్ పోస్ట్ సమీపంలో ఓ పాకిస్తాన్ జాతీయుడ్ని బీఎస్ఎఫ్ దళం పట్టుకుంది.ఇతని స్వస్థలం హకీమా వాలాకి చెందిన మహ్మద్ జైద్ గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని, విచారణ నిమిత్తం అధికారులు తీసుకెళ్లారు.ఏ ఉద్దేశంతో అతను సరిహద్దు దగ్గరకి వచ్చారో అన్న కోణంలో బీఎస్ఎఫ్ విచారణను ప్రారంభించింది.ఈ విషయంలో తాము నిరంతర అప్రమత్తతో వున్నామని అధికారులు తెలిపారు.
నివేదికల ప్రకారం, మొహమ్మద్ జైద్ సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుండగా BSF సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకోగానే అనుమానితుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏ ఉద్దేశంతో సరిహద్దు సమీపంలోకి వచ్చారో విచారణ చేస్తున్నారు.