రాణాతో సంబంధం లేదని బుకాయింపులకు దిగిన పాక్
26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విషయంలో దాయాది పాకిస్తాన్ కొత్త తరహా బుకాయింపులకు తెర తీసింది. రాణాతో తమకు సంబంధాల్లేవని పదే పదే చేతులు కడిగేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా… అమెరికా నుంచి తహవూర్ రాణా భారత్ కి వచ్చేశాడో.. వెంటనే హడావుడిగా పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాణాతో తమకు సంబంధం లేదని ప్రపంచాన్ని బుకాయింపు చేసేందుకు రెడీ అయ్యింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారి తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.తహవ్వుర్ రాణాతో తమకెలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. రాణా గత రెండు దశాబ్దాలుగా పాకిస్థాన్ డాక్యుమెంట్లను పునరుద్ధరించుకోలేదని తెలిపింది. ఆయన కెనడా జాతీయుడనే విషయం చాలా స్పష్టమని బుకాయింపులకు దిగింది.
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్‌తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.