పాలమూరులో పెరిగిన పామాయిల్ పంట దిగుబడి… ఆనందంలో రైతులు
మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు వాణిజ్య పంటలపై బాగా దృష్టిసారిస్తున్నారు. కూలీల కొరత, నీటి కొరత, ఖర్చు నేపథ్యంలో సంప్రదాయ పంటలపై కాకుండా ఈసారి ఆయిల్‌పాం సాగు చేసుకుంటున్నారు. గ్రామాలకు కూడా ఇది విస్తరించింది. గండేడ్, నవాబుపేట, రాజాపూర్, పాలమూరు ప్రాంతాల్లో అధికారులు దీనిపై బాగా దృష్టి సారించారు. 2019`20 ప్రాంతంలో కేవలం 200 ఎకరాల్లో మాత్రమే అధికారులు పామాయిల్ పంట సాగు చేయడం అధికారులు ప్రారంభించారు. దాదాపు 35 మంది రైతులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం 2023`2024లో దీని విస్తీర్ణం పెరిగింది. 1,419 ఎకరాల్లో 400 మంది రైతులకు పైగా ఈ పామాయిల్‌ను సాగు చేస్తున్నారు. ఇలా మొత్తం 16 గ్రామాల్లో ఈ పామాయిల్ తోటలు సాగవుతున్నట్లు అధికారులు పేర్కోంటున్నారు. అన్నారెడ్డిపల్లి, వెన్నాచేడ్, సల్కర్‌పేట, రుసుంపల్లితో సహా మరికొన్ని గ్రామాల్లో పామాయిల్ పంట పెరిగింది. అయితే… అధికారులు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నా… ఆశించిన దిగుబడి మాత్రం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటిన నాలుగో సంవత్సరానికే పంట చేతికి వస్తుండటంతో రైతులు కూడా సంతోషంగా ముందుకు వస్తున్నారు. మొదటగా 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. 7వ యేట నుంచి 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది.