శిశుమందిర్ ద్వారా పంచ పరివర్తన్
సమాజంలో బలమైన పురోగతి సాధించాలి అంటే పంచ పరివర్తన్‌ను అమలు చేయాలని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటువంటి మార్పు దిశగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.
- సామాజిక సమరసత: కుల, వర్గ ప్రాతి పదికన విడిపోకుండా అందరం కలసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి.
- కుటుంబ ప్రబోధన్: జీవన విలువలను పాఠశాల, కుటుంబాలద్వారా మన పిల్లలకు అందించడంవలన భావితరాలను మంచి మార్గంలో నడిపించగలుగుతాం.
- పర్యావరణ పరిరక్షణ: నీరు, అడవులు (మొక్కలు), పచ్చదనం కాపాడుకోవాలి. ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి.
- మన భాష -వేషధారణ: మనదైన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. మాతృభాషను, మాతృదేశాన్ని గౌరవించాలి.
- పౌరనియమాలు: ఒక పౌరుడిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి.
శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రతిఏటా వర్షారంభ సమావేశాలు నిర్వహిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ప్రధాన ఆచార్యులు, పాఠశాల కమిటీ నాయకులు, శైక్షణిక్ ప్రముఖ్‌లు పాల్గొంటారు . ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద యోజన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు సందేశాత్మకంగా ప్రసంగించారు.
ఈ సమావేశాల్లో క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, కోశాధికారి పసర్తి మల్లయ్య, ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మార్గదర్శనం చేశారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు సమావేశాలను నిర్వహించారు.