”పౌరుశాగ్నత్వం నుండి తపస్యత్వం” వైపు మళ్ళిన పరశురాముడు
పరుశురాముడు విష్ణు మూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం. వైశాఖ శుద్ధ తదియ రోజు పరశురాముడు జన్మించాడు. ఈ అవతారాన్ని ఆవేశావతారం అని కూడా పిలుస్తుంటారు. . అంటే భగవంతుడికి ఆవేశం వున్నంత వరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కూడా పేరుగాంచాడు. పరశురామ జయంతి నాడు ఉపవసించి , పరశురాముని షోడ శోపచారాలతో పూజించి,
‘‘జమదగ్నిసఱత వీర క్షత్రియాంతక ప్రభో
గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర’’ అని అర్ఘ్యాలు కూడా ఇవ్వాలని సంప్రదాయం చెబుతోంది. అత్యంత పౌరుశాగ్నుడు ఈ పరశురాముడు.
బలగర్వంతో విర్రవీగిన హైహయ సా మ్రాజ్యాధి నేత కార్తవీర్యార్జునుడిపై పగతో క్షత్రియ జాతినే నిర్మూలించదలచాడు భార్గవ రాముడు. శ్రీమహా విష్ణువు చక్రాయుధ అంశతో పుట్టి కార్తవీర్యార్జునుడు విజయ యాత్రలో భాగంగా జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. ఆ మహర్షిషతన ఆశ్రమంలోని హోమ ధేనువు సురభి సహకారంతో చక్రవర్తి పరివారానికి చక్కటి విందు ఇచ్చాడు. అంతటి మహిమ గల గోవు తన రాజ్యంలో వుండాలనే భావనతో చక్రవర్తి ఆజ్ఞ మేరకు సైనికులు దానిని మాహిష్మతీ నగరానికి తరలించారు. అడ్డువచ్చిన జమదగ్నిని నెట్టివేశారు. ఈ విషయం తెలుసుకున్న భార్గవ రాముడు ఆ నగరానికి చేరి, వేయి చేతుల ఆ మహావీరుడ్ని నేలకూల్చి, తపోవనానికి వెళ్లాడు. ఈ లోగా కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని ఆశ్రమంపై విరుచుకుపడి, తపోనిషషఠలో వున్న ఆయన శిరస్సును ఖండిరచాడు. రేణుకాదేవి రామా… రామా… అని 21 సవర్లు ఎలుగెత్తి పిలుస్తే భర్త మొండెంపై సొమ్మసిల్లి పడిపోయింది.రాజపుత్రులు ఆశ్రమానికి నిప్పు పెట్టడంతో సతీతులు దహనమయ్యారు.
తల్లి పిలుపుతో తపోభంగమైన పరశురాముడు కీడు శంకించి, తక్షణం ఆశ్రమానికి చేరాడు. కన్నవారు బూడిదగా మారడం చాలా కలచివేసింది . ‘‘ఇంత పాతకానికి ఒడిగట్టిన క్షత్రియుల రక్తంతో తర్పణం చేస్తాను . నీ ఖండిత శిరస్సును వారి రక్తంలో ముంచి అంతిమ సంస్కారం చేస్తాను ’’ అని తండ్రి సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు. పరశురాముడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రంతో మాహిష్మతీ రాజధాని 21 రోజుల పాటు కాలి నామరూపాలు లేకుండా ఆహుతైపోయింది. ఏకమై వచ్చిన హైహయ వంశ క్షత్రియులు, దేశదేశ రాజులను సంహరించి, తన శపథం చెల్లించుకున్నాడు. భూమండలాన్ని 21 సార్లు పర్యటించి క్షత్రియులను మట్టుబెట్టాడు. రాజవంశాలను నిర్మూలన చేశాడు.
అంతలోనే పశ్చాత్తాపం కలిగింది. ఒక రాజు మీద ఆగ్రహంతో క్షత్రియ జాతిపై కక్షబూనడం చాలా తప్పు అని భావించి, పాప క్షయం కోసం అశ్వమేథ యాగం చేశాడు. తన దండయాత్రలో అధీనమైన భూమిని కశ్యప ప్రజాపతికి అప్పగించాడు.‘‘నీ ఆగ్రహావేశాలతో అంతమైన క్షత్రియ వంశాలు పుట్టి పెరగాలి. అదే జరిగితే నీ శపథం ప్రకారం మళ్లీ మారణహోమం తప్పదు. కనుక ఈ ప్రాంతాన్ని విడిచి దక్షిణ సముద్రం వైపు వెళ్లు… పైగా ఈ భూమిని నాకు ధారాదత్తం చేశావు కనుక ఇది నా ససంతం. నాకు గల ఆ హక్కుతో ఈ మాట చెబుతున్నాను’’ అని కశ్యపుడు ఆదేశిసవ్తడు. కశ్యప మహార్షి ఆదేశాలతో దక్షిణ సముద్రంలోని మహేంద్రగిరిపై తపస్సుకి వెళ్లాడు పరశురాముడు. వృద్ధి చెందిన క్షత్రియ సంతతికి కశ్యపుడు ఆయా రాజ్యాలను స్వాధీన పరిచాడు. కశ్యప ప్రజాపతి సంతతి కారణంగా మళ్లీ రాజవంశాలు ఆవిర్భవించాయి. రాజ్యాలు బాగా పురోగతి సాధించాయి.
పరశురాముడు యుద్ధ రంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. ‘పరశు’ అంటే ‘గొడ్డలి’ అని అర్థం. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఈయన పరమేశ్వరుడిని మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు. తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు. ఆ తర్వాతే తనకు పరశురామునికి పేరొచ్చిందని పురాణాలలో పేర్కొనబడింది.
తల్లిని తిరిగి బతికిన్చుకున్న వాడు