సంభాల్ లో మసీదు రీసర్వే సమయంలో ముస్లింల రాళ్ల వర్షం.. 20 మంది అరెస్ట్
యూపీ సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడికక్కడే టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి ముందు, నవంబర్ 19 న మసీదు సర్వే నిర్వహించబడింది. సంభాల్ జామా మసీదు-హరిహర్ ఆలయ వివాదం కేసు తదుపరి విచారణ నవంబర్ 29 న జరగనుంది. దీనిలో ప్రాథమిక సర్వే నివేదికను సమర్పించాలి.
కాగా.. నేడు కోర్టు కమిషనర్ రమేష్ రాధవ్ నేతృత్వంలో ఉదయం 7.30 గంటల నుంచి లోపల సర్వే పనులు కొనసాగుతున్నాయి. మసీదు చుట్టూ ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జామా మసీదు భద్రతను కూడా పెంచారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శనివారం ఒక్కరోజే మసీదు ఆవరణలో ఇరువైపులా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కొత్వాలి ఇన్‌ఛార్జ్ అనూజ్ తోమర్ తెలిపారు. అన్ని కెమెరాల రికార్డింగ్ పోలీసు స్టేషన్‌లో అమర్చిన డీవీఆర్‌తో అనుసంధానించబడి ఉంది. అక్కడి నుంచి ఈ కెమెరాలను 24 గంటలూ పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు.
యూపీ సంభాల్ లోని అల్లర్ల వ్యవహారంలో పోలీసులు వేగంగా స్పందించారు. అంతే తీవ్రంగా కూడా స్పందిస్తున్నారు. షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు ముగ్గురు మరణించగా… దాదాపు 20 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రాళ్లు రువ్వడంలో కీలకంగా వున్న 20 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు కూడా.
హింసకు పాల్పడిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసుులు కూడా నమోదు చేశారు. మరోవైపు సంభాల్ జిల్లాలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. మరోవైపు అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు తెలిపారు. వీటన్నింటితో పాటు ఈ రాళ్లు రువ్వే చర్యల్లో ముందు పిల్లలను వుంచి, వెనుక నుంచి రాళ్లు రువ్విన వారిని గుర్తించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే కొందర్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే హింస నేపథ్యంలో స్థానికులు తమ పైకప్పులపై రాళ్లు, సోడా సీసాలు, మండే పదార్థాలను వుంచడం గానీ, కొనుగోలు చేయడంపై అధికారులు నిషేధం విధించారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఈ ఘటనపై సంభాల్ జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ తీవ్రంగా స్పందించారు. ఘటనకు కారుకులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అదనపు బలగాలను కూడా మోహరించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని ప్రకటించారు. కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారని, వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అన్నారు. అల్లర్లకు కారకులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. మొబైల్ ఫోన్ల ఆధారంగా అల్లర్లకు కారకులైన వారిపై చర్యలుంటాయని ఎస్పీ ప్రకటించారు.