ప్లాస్టిక్ వేస్టేజీతో పెట్రోల్ తయారీ… వినూత్న ప్రయోగం

ప్లాస్టిక్ భూతం విపరీతంగా పెరిగిపోయింది. సముద్రాల్లో, భూమిపై పేరుకుపోయింది. దీంతో మనుషులతో పాటు, జంతువుల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడాన్ని నిషేధించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, జాతీయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా తగినంతగా అదుపులోకి రావడం లేదు. దీంతో సౌత్ కొరియా ఓ అద్భుతమైన ప్రయోగం చేసింది. ప్లాస్టిక్ ను, వాటర్ ను కలిపి పెట్రోల్ తయారు చేశారు. సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ దిశగా ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు.దాదాపు 97శాతం వరకు ప్లాస్టిక్, నీళ్లను కలిపి ఇంధనం తయారు చేశారు.

ప్లాస్టిక్ వేస్ట్ ను నీళ్లతో కలిపి రుథీనియం జియోలైట్ వై అనే కేటలిస్టులతో రియాక్ట్ అయ్యేలా చేశారు. కేటలిస్ట్ రియాక్షన్ తో ఆ మిశ్రమంలోని నీళ్లు ప్లాస్టిక్ ను పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్ గా మార్చేలా చేశారు. ప్లాస్టిక్, రుథీనియం మిశ్రమంలో నీటిని కలపడం తో కార్బన్ ఎఫిషియెన్సీ పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. నీటితో ఆ మిశ్రమంలో చైన్ రియాక్షన్ మెకానిజమ్స్ మారిపోయాయని కనుగొన్నారు. అంతేకాక.. నీటిని యాడ్ చేయడంతో బొగ్గు ఎక్కువగా రాకుండా కేటలిస్టుల పనితీరు మరింత మెరుగుపడిందని తేల్చారు. ఆర్థికపరంగా కూడా ఇదిలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని పరిశోధనలకు అంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *