ఆ పోలిక అసమంజసం, అసంబద్ధం
ఆర్.ఎస్.ఎస్ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ల మధ్య పొలికే లేదు, అలా పోల్చటం అసంబద్ధం, అసమంజసం, తగని పని.
ఇటువంటి పోలిక చేసిన జాతీయవాద వ్యతిరేకశక్తులు కొంతమంది, కొన్ని సంస్థలు వాస్తవంగా ఉన్న సమస్యలకు విరుద్ధంగా తారుమారు చేసి, కనుమరుగయ్యేందుకు కావాలని కొన్ని కథనాలను సృష్టించి, ప్రచారం చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే, ఎంతో తెలివైనవ్యక్తులు కూడా, సరైన సమాచారం తెలియక లేదా తెలుసుకోకుండా, ఇటువంటి జాతీయవాద వ్యతిరేకత అనే ఉచ్చులో పడి, చిక్కుకుంటూ ఉంటారు.
1925లో స్థాపించబడిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచ మంతటిలో ‘వసుధైక కుటుంబకం’ (విశ్వమంతా ఏకైక కుటుంబం) అనే ప్రాచీన వేదవాక్యమే ఆధారంగా, సమతావాదంతో, సామాజిక, సాంస్కృతిక వేదికగా పనిచేసే ఒక ప్రముఖమైన, అతిపెద్దదైన స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ స్వయంసేవకులు సమాజసంక్షేమం కొరకు, జాతినిర్మాణంలో కొన్ని దశాబ్దాలనుండి నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళు సమాజంలోని వివిధ వర్గాలమధ్య వారధిగా పనిచేస్తూ, అటువంటి వారందరినీ సమాజసంక్షేమం, దేశరక్షణ గురించి పాటుచేసేటట్లు ప్రేరణ చేసి, ఐక్యంగా నిలబెట్టి, తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కోరలనుండి భారతీయ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వాళ్ళు, సత్యాగ్రహం వంటి అనేక పోరాటాలు చేశారు. ఎప్పుడు సమాజా నికి భారీ విపత్తులు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఆపదల్లో ఇరుక్కుని సహాయం కోసం విలవిల్లాడినా, ఆపన్నహస్తం అందించేందుకు వాళ్ళు ముందుంటారు. ఇటీవల సంభవించిన కోవిడ్-19 మహమ్మారి విజృం భించిన సమయంలో వేలాది స్వయంసేవకులు సమాజసేవ కోసం ముందుండి వివిధ సహాయ, సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇంకొకవైపు కొద్దిమంది అతివాదముస్లింలచే స్థాపించబడిన పి.ఎఫ్.ఐ. అనే వివాదాస్పదసంస్థ, ఇస్లామిక్ కార్యకలాపాలు మాత్రమే శాశ్వతలక్ష్యంగా పనిచేస్తున్నది.
2003లో కేరళలో కోజికోడ్‌లోని, మరాడ్ బీచ్ లో 8 మంది హిందువుల హత్యలు, అప్పటి అల్లర్లలో పి.ఎఫ్.ఐ. సభ్యులకు ప్రమేయం ఉందని వాళ్ళని అరెస్టు చేసినప్పుడు మాత్రమే, వాళ్ళ తీవ్రవాద, హింసాత్మకధోరణి బహిర్గతమైనది, దేశమంతటికీ తెలిసింది. (Radicalisation in India, Abhinav Pandya, Pentagon Books, pp 62)
పి.ఎఫ్.ఐ. కార్యపద్దతి
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటి (జేఎన్‌యూ)లో అధ్యయనపండితులైన సౌమ్యా అవస్థి, 2020లో పి.ఎఫ్.ఐ.పై ఒక పరిశోధనా పత్రం “Popular Front of India: Understanding the Propaganda and Agenda”లో వీళ్ళ కార్యనిర్వహణాపద్ధతి గురించి చాలా వివరంగా తెలియజేశారు. అందులో వారు ఏమి చెప్పారంటే – పి.ఎఫ్.ఐ. ముస్లింల సాధికారతే లక్ష్యంగా అస్థిత్వం ఏర్పరచు కొన్నప్పటికీ, వాళ్ళు తమ ఇస్లాం కార్యక్రమపట్టిక (ఎజెండా)ను ఒక వైపు ప్రదర్శనగా చూపించే వాళ్లు. దానిని కప్పి పుచ్చేందుకు వాళ్ళు మహిళలు, కూలీలు, రైతులు, దళితులు, ఆదివాసీలు అనే వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పైకి చూపించేవాళ్లు. ఇది చూసేవాళ్ళకు, పి.ఎఫ్.ఐ. ఒక అల్ప సంఖ్యాకుల, బలహీనవర్గాల సంక్షేమం కోసం పనిచేసే ఒక ధార్మికసంస్థ అనే ఒక రక్షణ కవచం ఏర్పరచు కొన్నారు. దీనితో, ‘ఈ సంస్థను నిషేధించవలసిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ఒక కుట్రపూరితమైన యోచన వాళ్ళు అమలు చేస్తున్నారు.
ఈ.డి. దర్యాప్తులో పి.ఎఫ్.ఐ, ఆర్.ఐ.ఎఫ్. సంస్థలు, కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల, మూలాల నుండి భారీ మొత్తాలలో నగదు స్వీకరించారని వెల్లడిరచారు. పి.ఎఫ్.ఐ. ఖాతాలలో మొత్తం రూ.60 కోట్ల కంటే ఎక్కువగా భారీ మొత్తం డిపాజిట్ చేశారు, అందులో రూ.30 కోట్లు దాటిన మొత్తాన్ని 2009లోనే డిపాజిట్ చేశారు. అలాగే, ఆర్.ఐ.ఎఫ్. ఖాతాలలో 2010 నుండి సుమారు రూ.58కోట్ల భారీ మొత్తం జమచేశారని వెల్లడిరచారు.
ఈడి ఇంకా తన ప్రకటలలో ‘‘ఈ విధంగా చట్టవిరుద్ధంగా, నేరపూరితంగా చేసిన, సేకరించిన నిధులు, వసూళ్లు పి.ఎఫ్.ఐ. మరియు ఆర్.ఐ.ఎఫ్. బ్యాంకు ఖాతాలలో మచ్చలేనట్లు పైకి చూపించి, నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా పి.ఎఫ్.ఐ. దాని సంబంధిత సంస్థలు, వ్యక్తులు చేస్తున్న ఒక భారీ ఎత్తున జరిగే నేరపూరితమైన కుట్ర, దేశద్రోహచర్య. దేశ, విదేశాల నుండి వాళ్ళు ఈ విధంగా చేసిన వసూళ్ళు, సేకరించిన నిధులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ, దేశవిద్రోహాలకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా, వాళ్ళకు, వాళ్ళ ఉద్యోగులు, సానుభూతిపరులకు వ్యతిరేకంగా అసంఖ్యాకమైన నేరారోపణ ఫిర్యాదులు, ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు అవుతున్నాయి.’’
ఇంతకీ ముగింపు ఏమంటే, ఎవరైనా జాతీయవాద సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్.తో వివాదాస్పద సంస్థ అయిన పి.ఎఫ్.ఐ.ను పోల్చటం ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఒకవేళ అలా పోలిస్తే, గత 97 సంవత్సరాలుగా ఆర్.ఎస్.ఎస్. మన జాతికి, దేశానికి, సమాజానికి చేసిన, చేస్తున్న స్వార్థరహితమైన సేవకు మనమందరం అన్యాయం చేసినట్లే.
– అరుణ్ ఆనంద్