‘‘పినాక’’ ప్రయోగం సూపర్ సక్సెస్

డీఆర్‌డీవో నిర్వహించిన దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ ‘పినాక’ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ సక్సెస్‌ అయ్యింది. సోమవారం చాందీపూర్‌లో 120 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్‌లో రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. ప్రణాళిక ప్రకారం విన్యాసాలను అమలుచేసిందని, కచ్చితత్వంతో టార్గెట్‌ను కూల్చిందని అధికారులు తెలిపారు. ‘పినాక’ విజయంపై డీఆర్‌డీవో సైంటిస్టులను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. మార్గనిర్దేశక వ్యవస్థ లేని రాకెట్లకు బదులుగా, నావిగేషన్‌తో కచ్చితమైన దాడుల కోసం ‘పినాక’ రాకెట్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.
డీఆర్‌డీవో సహకారంతో అర్మమెంట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ సంస్థ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పినాక రాకెట్‌ను రూపొందించారు. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకునేలా దీన్ని డిజైన్ చేశారు. సోమవారం చాందీపూర్‌లో ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌తో పాటు ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పర్యవేక్షించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *