అమెరికా సుంకాలకు భారత్ ఎప్పుడూ తలవంచదు : పీయూష్ గోయల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల చర్యలకు భారత్ ఎప్పటికీ తలవంచదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.అదనపు సుంకాలు ఉన్నప్పటికీ భారతదేశ ఎగుమతి పరిమాణం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉందని అన్నారు.

ఢిల్లీలో జరిగిన భారత్ బిల్డ్‌కాన్ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ, ఎవరైనా మాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనుకుంటే మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. అయితే, ఏ విధమైన వివక్షత అయినా భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మేము తలవంచం లేదా బలహీనులుగా మారిపోం. కలిసి కట్టుగా ముందుకు సాగుతూ కొత్త మార్కెట్లలో కూడా దూసుకెళ్తాం’’ అని పీయూష్ గోయల్ ప్రకటించారు.

వివిధ దేశాలతో ఇటీవల జరిగిన వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.దేశీయ విస్తరణను విస్తరించడానికి మరియు ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం త్వరలో వివిధ చర్యలను చేపడుతుందన్నారు.

రాబోయే రోజుల్లో, ప్రభుత్వం ప్రతి రంగానికి మద్దతు ఇవ్వడానికి వివిధ చర్యలను తీసుకుంటుందన్నారు. దేశీయంగా విస్తరించడానికి, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఇతర మార్కెట్లలో మన దేశ వస్తువులను పంపడానికి మరింత విస్తరించడానికి ప్రయత్నం చేస్తామని పీయూష్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *