1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే నూతన పథకం తెచ్చిన కేంద్రం
కేంద్ర కేబినెట్ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా 24 వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-2026 నుంచి 6 సంవత్సరాల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీనిని రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, పంటల్లో వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోత తర్వాత గ్రామ స్థాయిల్లో దిగుబడులను నిల్వచేసేందుకు గోదాముల సదుపాయం కల్పిస్తారు.
2. అలాగే నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను కేంద్రం రూపొందించింది. ఈ కార్యక్రమం కోసం ఏటా 24 వేల కోట్లు వ్యయం చేస్తారు.
3. మొత్తం 11 శాఖల్లో 36 పథకాలు, రాష్ట్రంలోని ఇతర పకాలు, ప్రైవేటు రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీనిని అమలు చేస్తారు.
4. ఉత్పాదకత తక్కువగా వుండటం, అన్ని రుతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా వుండటం అనే మూడు కీలక సూచిల ఆధారంగా 100 జిల్లాలను కేంద్రం గుర్తిస్తుంది.
5. ఈ పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు.
6. ప్రతి ధన -ధాన్య జిల్లాలో ఈ పథకం పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు.
7. దీని ద్వారా యేటా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.