అకాల వర్షాలతో నష్టపోయిన వారికి అభయం “ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన”
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి పంట, మామిడి పంటలతో సహా పలు పంటలు వేసిన రైతుల ధీమా సడలిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వారిలో స్థైర్యాన్ని నింపే పథకం వుంది. అదే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’’. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన పథకం ఇది. గత తెలంగాణ సర్కార్ దీనిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ… ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో చేరింది. 50 శాతం బీమా ప్రీమియం చెల్లించేందుకు నిధులను భరిస్తామని అంగీకరించడంతో రైతుల ఆశలకు జీవం పోసిట్లయింంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాతో సహా పలు జిల్లాల్లో పత్తిని బాగా సాగు చేశారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో ఈ పంట కూడా చేర్చారు. దీంతో పత్తి రైతులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. విత్తనం నాటే దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే రైతులకు ఇన్సురెన్స్ సొమ్ము ఈ పథకం కింద అందుతుంది. కౌలు రైతులతో సహా సాధారణ రైతులందరికీ ఈ పథకం కింద బీమా పొందడానికి అర్హత కలిగి వుంటారు.
ఇక ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకంతో పాటు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి ‘‘సారథి’’ అనే పోర్టల్ ను కేంద్రం ప్రారంభించింది. పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘‘కిసాన్ రక్షక్’’ పోర్టల్‌నూ, 14447 నంబర్ హెల్ప్‌లైన్ నూ ప్రారంభించారు. ఫసల్ బీమా, సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి రైతులకు సమాచారం అందించే ఏర్పాటు కూడా జరిగింది. సింగిల్ విండో పోర్టల్ రైతులకు డిజిటల్ పంథాలో పంట బీమా పొందే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ పోర్టల్ లో బీమా పథకాలను పరిశీలించి, కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ పద్ధతిలో ప్రీమియం కూడా చెల్లించవచ్చు. సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు.
పొలంలో పంటకు జరిగిన నష్టంతో పాటు, విత్తనాలు వేయలేకపోవడం, పంట కోత తర్వాత జరిగే నష్టాలకు, వరద ముప్పు వంటి విపత్తలకు ఈ బీమా వర్తిస్తుంది. పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతాన్ని నేరుగా అన్నదాతల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తారు. క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతికతను వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వాఆరా పంటకోతల సమాచారాన్ని ఫొటోలు తీసి, వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేస్తారు.
ఫసల్ బీమాకి దరఖాస్తు చేయడం ఎలాగంటే…
1. ముందుగా… ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
2. ఫార్మర్స్ కార్నర్‌లో స్వయంగా పంటల బీమా కోసం అప్లై చేయడం () తో లాగిన్ చేస్తే ఫోన్‌కి ఓటీపీ వస్తుంది.
3. తదుపరి దశలో పేరు, వయస్సు, మొబైల్ నెంబర్, లింగం, రైతురకం, వర్గం, రైతు ఖాతా వివరాలు వంటి నింపాలి.
4. తర్వాత క్రియేట్ యూజర్‌పై క్లిక్ చేయాలి.
5. లాగిన్ వివరాలు పూర్తి చేసిన తర్వాత అవి రైతుకు అందుతాయి.