స్పేస్ డే నాటికి సలహాలు పంపండి : ప్రధాని మోదీ పిలుపు
ఆగస్ట్ 23 న జరగబోయే నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్ ను వాడుకోవాలన్నారు. 124 వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఈ సూచనలు చేశారు. గత కొన్ని వారాలుగా స్పేస్, సైన్స్ రంగాల్లో విజయాల గురించి మనం మాట్లాడుకున్నామని, వ్యోమగామి శుభాంశు శుక్లా భూమిపైకి తిరిగి వచ్చారన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం సమయంలో కూడా దేశంలో ఎంతో ఉత్సాహం నెలకొందని, నేషనల్ స్పేస్ డే సందర్భంగా సలహాలు, సూచనలు నమో యాప్ ద్వారా పంపాలని సూచించారు.
దేశంలో స్పోర్ట్స్ స్టార్టప్‌లు పెట్టేందుకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత ఆ దిశగా ఆలోచనలు చేయాలని కోరారు.
భారత విద్యార్థులు స్సేస్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని, ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారని తెలిపారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ‘ఇన్‌స్పైర్ మనక్ అభియాన్’ గురించి మాట్లాడుతూ మోదీ.. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని.. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని దీనికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.