కశ్మీరీ యువకుల చేతిలో పెన్నులు, పుస్తకాలు వచ్చేశాయ్ : ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్ మోదటి దశ ఎన్నికల్లో 60.21 శాతం ఓటింగ్ నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో 50 వేల మంది డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు తీసుకొచ్చామని, కశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు లేవని, పుస్తకాలు, పెన్నులే కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ లో ఉపాధి అవకాశాలు, పర్యాటకం కూడా బాగా మెరుగైందన్నారు. ఎయిమ్స్, ఐఐటీ లాంటి న్యూస్ ఇప్పుడు కశ్మీర్ లో వినిపిస్తోందని, గతంలో లాల్ చౌక్ దగ్గర ఇబ్బందికర పరిస్థితులు వుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. స్కూళ్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసేవారని, అంటే వారి ద్వేషం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

 

కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల చేతికి రాళ్లు ఇచ్చేవని, తాము మాత్రం పెన్నులు, పుస్తకాలను ఇస్తున్నామని తెలిపారు. ఈ భూమ్మీద ఏ శక్తీ జమ్మూకశ్మీరుకు 370 అధికరణను పునరుద్ధరించలేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ)లు పాకిస్థాన్‌ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస, అశాంతే ఆ ఎజెండాగా పేర్కొన్నారు. ఈ ఎజెండాతోనే జమ్మూకశ్మీరులో పలు తరాలను నాశ నం చేసి నెత్తుటేర్లలో ముంచింది. పాక్‌కు తీవ్ర హెచ్చరిక చేస్తున్నా.. దాని ఎజెండాను ఇక్కడ అమ లు కానివ్వం. భూమ్మీద ఏ శక్తీ 370ని తిరిగి తీసుకురాలేదు’ అని ప్రధాని తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *