ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే పాక్ కి నిద్రలేని రాత్రులు : మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కి వెళ్లిన ప్రధాని.. సోమవారం ఉదంయ నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినం జరుపుకోవడం అదృష్టమని న్నారు. ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఓ వైపు నాకు మహా సముద్రం, మరోవైపు భారత మాత అందించిన ధీర జవాన్ల బలం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్య కిరణాలు, జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లాగా మెరుస్తున్నాయన్నారు.
MODI2
ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను కొనియాడారు. భారత రక్షణ దళాల సామర్థ్యానికి ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌక ప్రతీక అని మెచ్చుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ ను మోకాళ్లపై నిల్చోబెట్టిందని, శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, ఈ పేరు వింటేనే చాలు.. పాక్ కి నిద్రే పట్టదని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *