సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలి : ప్రధాని మోదీ పిలుపు
సేంద్రీయ ఉత్పత్తులపై అందరూ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే వీటి ఎగుమతులపై కూడా దృష్టి నిలపాలన్నారు. అగ్రిస్టాక్ వంటి డిజిటల్ వ్యవస్థను ఉపయోగించుకొని సహకార రంగంలో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకార రంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులోనే పై సూచనలు చేశారు.
యూపీఐ వ్యవస్థను రుపే కిసాన్ క్రెడిట్ కార్డుతో అనుసంధానించి ఆర్థిక లావాదేవీలకు వీలు కల్పించాలని సూచించారు. సహకార్ సే సమృద్ధి అనే అంశంపై కూడా పలు సూచనలు చేశారు. సాంకేతికతను ఉపయోగించి, సహకార రంగంలో సమూల మార్పులు తేవాలన్నారు. ఈ మేరకు పీఎంవో ఓ ప్రకటనను విడుదల చేసింది.
సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతి మార్కెట్లపై దృష్టి నిలపాని ప్రధాని సూచించారు. వ్యవసాయ పద్ధతులను మెరుగు పరిచేందుకు మేలైన మట్టి నమూనా పరీక్షల్ని రూపొందించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఐఐఎం స్థాయిల్లో సహకార రంగంపై కోర్పులు ప్రవేశపెట్టాలని కూడా సూచించారు.