దశాబ్దాల క్రితం తలపోస్తే… ఇప్పుడు ప్రారంభమైన చీనాజ్ బ్రిడ్జి

భారత్ లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతున్న ఈ బ్రిడ్జి శుక్రవారం ప్రారంభం అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఉదమ్‌పూర్.. శ్రీనగర్.. బారాముళ్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అలాగే కట్ ఢాలో 46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. కట్ ఢా- శ్రీనగర్ మధ్య రైలుకు ప్రధాని మోదీ జెండా ఊపారు. అలాగే దేశంలోనే మొట్టమొదటి సారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన కూడా ప్రారంభమైంది.
అత్యంత కష్టంగా వుండే శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపాలన్న బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికి కార్యరూపం దాల్చింది.ఈ సందర్భంగా ప్రధాని మోదీ చినాబ్, అంజీ వంతెలనపై వందేభారత్ రైలులో ప్రయాణించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ లో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. అక్కడి పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు.
modi2
చినాబ్ వంతెన ప్రత్యేకతలివీ…
రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను మిగితా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ – శ్రీనగర్- బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఈ వంతెన భాగం. చినాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు.దీని పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై వున్న షుబాయ్ రైల్వే వంతెన 275 మీటర్ల ఎత్తు వుంది. ఈ ప్రపంచ రికార్డును మన భారత్ అధిగమించేసింది.
ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42ఏళ్ల క్రితం బీజం పడింది. ఆ కల ఇప్పుడు నిజం అయ్యింది. అయితే రూ. 50కోట్ల అంచనాతో పూర్తి చేయాలనుకున్న ఈ రైల్వే ప్రాజెక్టు కాస్త ఇప్పుడు దాదాపు 43, 800 కోట్లకు చేరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్ముకశ్మీర్ కు ఒక రైలు నడవనుంది. స్టీమ్ ఇంజిన్ రైలును నడిపించేందుకు మొదట భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో ప్రయాణించనుంది. ఎంతో విశిష్టతోపాటు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి నిర్మించారు.
భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న దేశవాసుల గర్వకారణంగా భావిస్తున్ను చీనాబ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోలిక సంక్లిష్టతలను కలిగి ఉన్న శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి ఆలోచన సాకారం అయ్యేందుకు 132ఏళ్లు పట్టింది. దేశానికి స్వాతంత్ర్యం రాకపముందు దేశ విభజన జరగకముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన ఇది. ఇన్నేళ్లకు పూర్తయ్యింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చేట్టారు. రూ. 50కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినా..ఇప్పుడు అది కాస్త పూర్తయ్యేందుకు రూ. 43,800కోట్లు అయ్యింది.
modi23
జమ్మూకశ్మీర్ కి సంబంధించిన కొన్ని రికార్డుల ప్రకారం చూస్తే… కాశ్మీర్ కు రైలు మార్గం ఆలోచన మొదటగా 1892 మార్చి 1వ తేదీన మహారాజా ప్రతిపాదించారు. ఆ తర్వాత 1898 జూన్ లో సర్వేలు చేసేందుకు ప్రాజెక్టు అమలు చేసేందుకు బ్రిటీష్ ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఆర్ స్కాట్ స్ట్రాటెన్ అండ్ కోను నియమించారు. కాశ్మీర్ కు రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు ముగ్గురు బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక నివేదికలను రెడీ చేసి..దాన్ని అమలు చేసేందుకు ఈ ఇంజనీర్లను నియమించారు. అయితే 1898 నుంచి 1909 మధ్య 11 సంవత్సరాల్లో ఈ ఇంజనీర్ల టీమ్ సిద్ధం చేసిన మూడు నివేదికల్లో రెండింటిని తిరస్కరించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు కూడా జరిగాయి. 1952 లో మహారాజా మరణించాడు. ఆ తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమం కూడా మరింత ఉధృతమైంది. ఇప్పుడు ఈ కల సాకారమైంది.
modi234
పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం తట్టుకుంటుంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. జమ్మూ నుంచి శ్రీనగర్ కి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ వంతెన జీవిత కాలం 120 ఏళ్లు అని నిపుణులు చెబుతున్నారు. దీనిపై గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో రైలు వెళ్తుంది. దీని నిర్మాణం కోసం కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. 28 వేల టన్నుల ఉక్కును కూడా ఉపయోగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *