దేశ విద్యా వ్యవస్థలో మైలురాయి.. నలందవిశ్వా విద్యాలయ నూతన క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
బిహార్‌లోని చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ యూనివర్శిటీకి చేరుకోగానే ప్రధాని… మొదట యూనివర్శిటీలోని పాత భవనాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కి చేరుకొని.. అక్కడ బోధి వృక్షాన్ని నాటారు. అనంతరం నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. నలంద విశ్వవిద్యాలయం లోతైన చారిత్రక మూలాలు కలిగి వుందని, భారత దేశ విద్యా రంగానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని అభివర్ణించారు. భారత దేశ ప్రజలకు ఈ యూనివర్శిటీతో ఎంతో అనుబంధం కలిగి వున్నారని, యువత విద్యా అవసరాలను తీర్చడంలో ఈ యూనివర్శిటీ కచ్చితంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీంతో భారత దేశ విద్యావిధానంలో ఓ కొత్త మైలురాయి అని చెప్పుకోవచ్చు.
2016 లో నలందను యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. దీంతో 2017 లో యూనివర్శిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యయి. ఇక ఈ కార్యక్రమానికి వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధులు కూడా హాజరయ్యారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సీఎం నితీశ్, నలంద యూనివర్శిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నంతో సహా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘‘నెట్ జీరో గ్రీన్ క్యాంపస్’’ గా కొత్త క్యాంపస్
ఈ కొత్త క్యాంపస్ నెట్ జీరో క్యాంపస్‌గా రూపొందించారు. అంటే పర్యావరణ అనుకూలంగా రూపుదిద్దబడిరదని అర్థం. ఈ కొత్త క్యాంపస్‌లో 40 తరగతి గదులున్న రెండు అకడమిక్ బ్లాకులున్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది పిల్లలకు సీటింగ్ వుంటుంది. విశ్వవిద్యాలయంలో 300 సీట్లున్న రెండు ఆడిటోరియాలు కూడా వున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ కేంద్రం, యాంఫీ థియేటర్ కూడా వుంది. ఇందులో 2 వేల మంది కూర్చునే సామర్థ్యం వుంది. ఇవి మాత్రమే కాకుండా విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లేక్స్‌తో సహా అనేక ఇతర సౌకర్యాలున్నాయి. క్యాంపస్‌లో నీటిని రీసైకిల్ చేయడానికి ఒక ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులతో పాటు పర్యావరణ అనుకూలమైన అనేక సౌకర్యాలున్నాయి. అసలు నలంద విశ్వవిద్యాలయం అత్యంత పురాతనమైంది. 1600 సంవత్సరాల క్రితం ఐదో శతాబ్దంలో స్థాపించబడిరది. ఈ విశ్వవిద్యాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే… భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలో దీనిని నాశనం చేశారు. అగ్ని ప్రమాదానికి గురైంది.