”అమ్మ” పేరుతో ఓ మొక్క నాటండి : ప్రధాని మోదీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ కీలక సూచన చేశారు. అమ్మ పేరుతో ఓ మొక్క నాటండి అంటూ పిలుపునిచ్చారు. ”ఏక్ ఏడ్ మా కే నామ్” అంటూ సూచించారు. దీని ద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని అభిప్రాయపడ్డారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా మన్‌కీ బాత్ నిర్వహించారు. ఇందులోనే ఈ ప్రస్తావన చేశారు. ”వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి. నేనూ మా అమ్మ స్మారకార్థం ఒక మొక్క నాటుతాను. తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడనం నాకెంతో సంతోషాన్నిస్తుంది. చాలా మంది తమ తల్లులను తీసుకెళ్లి మొక్కలు నాటుతున్నారు.త్లులు చనిపోయిన వారు వారి ఫోటోలను తీసుకొని వెళ్లి మొక్కలను నాటుతున్నారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుంది” అంటూ ప్రధాని మోదీ ఆకాంక్షించారు.