కోసం జరిగిన మహా యజ్ఞం ముగిసింది : ప్రధాని మోదీ
భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని, ఇక భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నవ భారత్ ను నిర్మించే కొత్త శకం వచ్చిందన్నందుకు నిదర్శనమే కుంభమేళా అని అన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ చాలా మంది వ్యయ ప్రయాసలకోర్చి రావడం ఆనందంగా వుందన్నారు.
ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవ్వరైనా అసౌకర్యానికి గురైతే అందుకు క్షమించాలని కోరారు. ఈ మేరకు తన బ్లాగ్ లో రాశారు. ఐక్యత కోసం జరిగిన మహా యజ్ఞం ముగిసిందన్నారు. భక్తులెవ్వరికీ ఆహ్వానాలు పంపలేదని, అయినా పవిత్ర స్నానాల కోసం తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. ఇన్ని కోట్ల మంది ఎలా వచ్చారా? అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందని, ఈ గొప్ప కార్యక్రమాన్ని పోల్చడానికి ఏదీ సరిపోదని మోదీ చెప్పుకొచ్చారు.