పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి : బడ్జెట్ పై ప్రధాని
కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయన్నారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోదీ మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశంసించారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు.. బడ్జెట్ బాగుందని ఆమెతో పేర్కొన్నారు. ఇక… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ప్రధాని హృదయంలో మధ్యతరగతికి చోటు వుందన్నారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్ధిక శ్రేయస్సును పెంపొందించడంలో దోహదపడుతుందని ట్వీట్ చేశారు.