భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు : ప్రధాని మోదీ
పహల్గామ్ ఉగ్రదాడి జరిగి యేడాది పూర్తైన సందర్భంగా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ఎక్స్ మాధ్యమంగా సానుభూతి ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తనతో పాటు దేశం మొత్తాన్ని ఎంతో కలచివేసిందన్నారు. ఈ విషాదాన్ని, ఇందులో మరణించిన అమాయకులను ఎప్పటికీ మరిచిపోలేమని, వారిని స్మరించుకుంటున్నట్లు తెలిపారు. ఆ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. దు:ఖంలో, సంకల్పంలోనూ దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ సఫలం కాలేవన్నారు.
ఇక గత యేడాది ఏప్రిల్ 22న హిందూ పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు పహల్గాంలో ఉగ్రదాడికి దిగారు. హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరగ్గా, 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. దీని ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో ఇస్లామిక్ ఉగ్రవాదులపై విరుచుకుపడింది.