కువైట్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’ అందుకున్నారు. నరేంద్ర మోదీకి ఇది 20వ అంతర్జాతీయ పురస్కారం. ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ అనేది కువైట్ నైట్ హుడ్ ఆర్డర్.

దీన్ని స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ సార్వభౌమాధికారులు, విదేశీ రాజ కుటుంబాల సభ్యులకు ఇస్తారు. ఈ పురస్కారాన్ని గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి నేతలు కూడా స్వీకరించారు. గత నెల ప్రధాని మోదీ తన దేశ పర్యటన సందర్భంగా గయానా అత్యున్నత జాతీయ అవార్డు ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను కూడా అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మోదీ కువైట్ పర్యటనలో ఉన్నారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాహ్ చేతుల మీదుగా ముబారక్ అల్-కబీర్ ఆర్డర్‌ను పొందడం ఓ గౌరవంగా భావిస్తున్నానని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. తాను ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు, భారత్-కువైట్ మధ్య ఉన్న బలమైన స్నేహానికి అంకితం చేస్తున్నానని

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *