పేలుడు బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు : మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భూటాన్ రాజధాని థింపులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై స్పందించారు.

బాంబు దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ బాంబు దాడి ఘటన వెనకున్న కుట్రదారులను వదిలిపెట్టమని, బాధ్యులందర్నీ చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. ఈ పేలుడు అత్యంత భయంకరమైందని, బాధిత కుటుంబాల దు:ఖాన్ని తాను అర్థం చేసుకున్నానని అన్నారు.

ఈ రోజు దేశం మొత్తం బాధితుల పక్షాన నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను రాత్రంతా సంప్రదిస్తూనే వున్నాను. మా ఏజెన్సీలు ఈ కుట్రను గుర్తిస్తాయి, ఛేదిస్తాయి. బాధ్యులందర్నీ చట్టం ముందు నిలబెడతాం. భారత దేశం ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతిచ్చే వారిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తుంది’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *