ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి… పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్‌పైనే తొలి సంతకం చేసిన మోడీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తన బాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో తన విధుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే కట్టుబడి వుందని ప్రధని మోదీ ఈ సందర్భంగా వెల్లడిరచారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి, కర్షకుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందే కావడం విశేషం.