ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ ప్రపంచ నేతలూ చెప్పలేదు : ప్రధాని మోదీ
పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు పన్నినా… ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ పై మంగళవారం లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టామని, ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నామని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని, ఈ విజయానికి సంకేతంగా పార్లమెంటులో భారత్ విజయోత్సవాలు చోటుసుకుంటోందని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తనపై నమ్మకం ఉంచారని, సిందూర్ శపథాన్ని నెరవేర్చామని చెప్పారు. భారత సైనల శౌర్య, ప్రతాపాలు, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినందుకు, ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు పార్లమెంటులో ఈ వియోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ ఆపమని ఎవ్వరూ చెప్పలేదు….
ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మే 9 న అమెరికా ఉపాధ్యక్షుు జేడీ వాన్స్ తనతో ఫోన్లో మాట్లాడారని, పాక్ భారీగా దాడి చేయబోతోందని హెచ్చరించారని వెల్లడించారు. పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్ కి తాను చెప్పానని పేర్కొన్నారు. పాక్ కి ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని కూడా స్పష్టంగా చెప్పానని, పాక్ ఎలాంటి దాడి చేసినా తాం చూసుకుంటామని కూడా అమెరికా ఉపాధ్యక్షుడికి స్పష్టంగా చెప్పానని మోదీ తెలిపారు. బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం చెప్తామని కూడా స్పష్టం చేశామని, పాక్ కి చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామన్నారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని, బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ ఆపేశామని ప్రధాని ప్రకటించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్ ను కాంగ్రెస్ మాత్రమే తప్పుబడుతోందని, స్వార్థ రాజకీయాల కోసమే సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని దుయ్యబట్టారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, తద్వారా సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మీడియా హెడ్ లైన్లలో వుండొచ్చేమో గానీ.. ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేరని చురకలంటించారు. పాకిస్తాన్ ను కాంగ్రెస్ వెనకేసుకురావడం అత్యంత దౌర్భాగ్యమని నిప్పులు చెరిగారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ ఇలాగే మాట్లాడిందని, పైలట్ అభినందన్ పాక్ కి చిక్కిన సమయంలోనూ ఇలాగే మాట్లాడారని దుయ్యబట్టారు. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోందని, భారత రక్షణ సామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం వుందని, భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనపై నమ్మకం వుంచినందుకు దేశ ప్రజలకు రుణపడి వుంటామని పేర్కొన్నారు.
అణు బ్లాక్ మెయిలింగ్ పనిచేయదు…
అణు బ్లాక్ మెయిలింగ్ కి భయపడమని, ఇకపై అది పనిచేయదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భారత్ పై ఉగ్రదాడి అంటూ జరిగితే మేము మా సొంత పద్ధతిలో, మా పరిస్థితులకు అనుగుణంగా, మాకు నచ్చిన సమయంలోనే స్పందిస్తాం. ఈ మూడు అంశాలను తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ అణు బ్లాక్ మెయిల్ కూడా పనిచేయదు. మూడోది.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రభుత్వాలు, ఉగ్రవాద సూత్రధారులను వేర్వేరుగా చూడలేం’’ అన్న విషయాలు తేటతెల్లమయ్యాయని అన్నారు.