శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి, నమస్కరించారు. దీని తర్వాత శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను కూడా సందర్శించారు. తదనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు సోమయాజుల నాగేశ్వర రావు శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకతలు, శివాజీ చిత్ర పటాల వివరణను ప్రధాని మోదీకి తెలియజేశారు.అలాగే ధ్యానముద్రలో వున్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను కూడా మోదీ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాంజలి అర్పించారు. చివరగా శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు సోమయాజుల నాగేశ్వర రావు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ ప్రధాని మోదీకి శివాజీ స్ఫూర్తి కేంద్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు.
kendram2
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భ్రమరాంబ దేవికి ఖడ్గమాలను సమర్పించి, కుంకుమార్చన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *